logo

నాపై కావాలనే దుష్ప్రచారం: ముత్తంశెట్టి

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రజల నుంచి స్పందన బాగుందని, అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి

Updated : 22 May 2022 12:18 IST

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రజల నుంచి స్పందన బాగుందని, అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణను చూసి తెదేపా అధినేత చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కార్యక్రమాల్లో జరుగుతున్నది ఒకటి, మీడియాలో వస్తున్నది మరొకటిగా ఉందన్నారు.కలెక్టరేట్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95శాతం అమలు చేశామమన్నారు. భీమిలి మండలం కోరాడలో జరిగిన రైతుభరోసా కార్యక్రమంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒక విలేకరిని ఒరేయ్‌ పంతులు అని సంబోధించానని అంటున్నారని, తాను వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించలేదన్నారు. అలా అని అంటే క్షమించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు