logo
Updated : 23 May 2022 04:35 IST

పెళ్లికెళ్తూ తిరిగి రాని లోకాలకు..

బైకు అదుపు తప్పి యువకుడి దుర్మరణం

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌, ఎస్సై రమేష్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: స్నేహితుడి పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్న యువకుడిని అమిత వేగం బలితీసుకుంది. జాతీయ రహదారిపై ఉమ్మలాడలోని శారదానది వంతెన సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌, ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం పెందుర్తి మండలం పొర్లిపాలెంకు చెందిన కోన లోకేష్‌సాయికుమార్‌ (23) విశాఖ నగరం షీలానగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కశింకోటలో ఆదివారం స్నేహితుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఉమ్మలాడ కూడలి శారదానది వంతెన వద్ద రెయిలింగ్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్‌ తెలిపారు.

లారీ ఢీకొని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని..

విశాఖపట్నం: వీఎంఆర్డీఏ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిగా పని చేస్తున్న వివాహిత మారికవలస వద్ద లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందింది. సీఐ ఎ.రవికుమార్‌ తెలిపిన వివరాలిలా.. విజయనగరానికి చెందిన జి.అర్జునరావు సబ్బవరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నారు. నగరంలోని వుడా పార్కులోని టికెట్‌ కౌంటర్‌లో వీఎంఆర్డీఏ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిగా పని చేస్తున్న అతని భార్య జి.స్వర్ణ (30), ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై విజయనగరం వెళ్లారు. ఆదివారం తిరిగి వస్తుండగా మారికవలస వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా అర్జునరావు, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని