logo
Published : 23 May 2022 05:38 IST

బస్సు యాత్రను విజయవంతం చేయండి

మంత్రి మేరుగ నాగార్జున

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఈనెల 26 నుంచి 29 వరకు తలపెట్టనున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి మేరుగ నాగార్జున కోరారు. ఆదివారం మద్దిలపాలెంలోని వైకాపా నగర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర ఈనెల 26న శ్రీకాకుళంలో ప్రారంభమై 27న నగరంలోని పలు నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే, వైకాపా జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, జంగా కృష్ణమూర్తి, మేయర్‌ హరివెంకటకుమారి, తదితరులు పాల్గొని గోడపత్రికను ఆవిష్కరించారు. 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని