logo

జీవ వైవిధ్యం బాధ్యత మనదే..

మన పరిసరాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ జంతు

Published : 23 May 2022 05:38 IST

ఎం.వి.పి.కాలనీ, ఎండాడ - న్యూస్‌టుడే: మన పరిసరాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవానికి సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జూలో నూతనంగా సరీసృపాల కోసం నిర్మించిన ప్రత్యేక నిర్మాణాలు, క్వారంటైన్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జంతు ప్రదర్శనశాలల్లో అవసరాన్ని బట్టీ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. 3 లక్షల హెక్టార్లలో విస్తరించిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌లో సుమారు 63 పులులు ఉన్నట్లు గుర్తించామన్నారు. జూ అభివృద్ధికి సీఎస్‌ఆర్, సీఈఆర్‌ నిధులను తీసుకురావటంలో జూ క్యూరేటర్‌ కృషిని అభినందించారు. బీ జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందని సలారియా మాట్లాడుతూ ఇటలీలోని పార్కో నేచురావివా జంతు ప్రదర్శనశాలతో పలు కార్యక్రమాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎఫ్‌ పి.రామ్మోహనరావు, డీఎఫ్‌ఓ అనంత శంకరన్, సహాయ క్యూరేటర్‌ ఉమామహేశ్వరి, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారులు, జూ ఎడ్యుకేషన్‌ బృందం తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం నుంచి జూలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు