logo

యూసీడీ ‘ఆడిట్‌’ మాయాజాలంపై విచారణ

ఆడిట్‌ పేరిట మహిళా సంఘాల నుంచి జీవీఎంసీ యూసీడీ (పట్టణ సామాజికాభివృద్ధి) సిబ్బంది చేసిన అక్రమ వసూళ్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మేయరు హరి వెంకట

Published : 23 May 2022 05:38 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఆడిట్‌ పేరిట మహిళా సంఘాల నుంచి జీవీఎంసీ యూసీడీ (పట్టణ సామాజికాభివృద్ధి) సిబ్బంది చేసిన అక్రమ వసూళ్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మేయరు హరి వెంకట కుమారి తెలిపారు. ఈనెల 15న ‘ఈనాడు’లో యూసీడీ ‘ఆడిట్‌ మాయాజాలం శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా 18 వేల సంఘాల నుంచి రూ.300 చొప్పున రూ.54 లక్షలు వసూలు చేయడం తీవ్ర తప్పిదమన్నారు. బాధ్యులు ఎవరో విచారణలో తెలుస్తుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని