logo

శిశువు విక్రయంపై ఆరా?

నగర శివారులోని ఓ పోలీసుస్టేషన్‌ పరిధిలో శిశువు విక్రయం జరిగినట్లుగా సమాచారం. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. శిశువు పుట్టిన తర్వాత బాలింత కుటుంబ

Published : 24 May 2022 05:37 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగర శివారులోని ఓ పోలీసుస్టేషన్‌ పరిధిలో శిశువు విక్రయం జరిగినట్లుగా సమాచారం. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. శిశువు పుట్టిన తర్వాత బాలింత కుటుంబ సభ్యులే ఇతరులకు శిశువును రహస్యంగా విక్రయించినట్లుగా సచివాలయ సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన పోలీసులు ఆ బాలింత కుటుంబ సభ్యులను పిలిచి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా విక్రయించారా? లేదా అనధికారికంగా దత్తత ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలను పోలీసులు ధ్రువీకరించలేదు.


మోసగించిన కేసులో ఆర్‌ఎస్‌ఐ అరెస్టు

నరసన్నపేట, న్యూస్‌టుడే: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఓ ఆర్‌ఎస్‌ఐను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ తిరుపతిరావు వివరాల మేరకు... నరసన్నపేట మండలంలోని తామరాపల్లి గ్రామానికి చెందిన యువతి కోటబొమ్మాళి మండలంలోని ఒక గ్రామంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు. జలుమూరు మండలంలోని బసివాడ గ్రామానికి చెందిన ముప్పిడి హేమసుందరరావు విశాఖలోని గ్రేహౌండ్స్‌ విభాగంలో ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిరువురూ 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లు ఆమెకు సన్నిహితంగా మెలిగిన హేమసుందరరావు 2020 నుంచి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదు. అప్పటినుంచి పెద్దల వద్దకు తిరిగిన యువతి చివరకు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుమేరకు ఎస్సై సింహాచలం కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా, సీఐ తిరుపతిరావు సోమవారం ఆర్‌ఎస్‌ఐ హేమసుందరరావును నరసన్నపేటలో కంబకాయ జంక్షన్‌లో అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు