logo

నిధులు లేవు.. విలువా లేదు

అనకాపల్లిలో సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సంఘ సమావేశం నిర్వహించారు. దీనిలో అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు చింతకాయల ముత్యాలు

Published : 24 May 2022 05:37 IST

ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల ఆవేదన


మాట్లాడుతున్న ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు చింతకాయల ముత్యాలు

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లిలో సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సంఘ సమావేశం నిర్వహించారు. దీనిలో అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు చింతకాయల ముత్యాలు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సర్పంచులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ● గతంలో పంచాయతీలు చేసే తీర్మానాలకు అనుగుణంగా పనులు చేసేవారన్నారు. ఇప్పుడు వాలంటీర్లు చెప్పిన పనులే చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందన్నారు. ఛాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొర్రా నాగరాజు మాట్లాడుతూ పోరాడితేనే నిధులు వస్తాయన్నారు. ఛాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి ముత్యాలరావు మాట్లాడుతూ అధికార పార్టీ వారితో సహా ఏ ఒక్క సర్పంచీ సంతోషంగా లేరన్నారు. తమది ప్రభుత్వంపై పోరాటం కాదని హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా చేస్తున్న పోరాటమని చెప్పారు. తాను మూడుసార్లు సర్పంచిగా గెలిచానని, గత రెండుసార్లు ఎంతో తృప్తి లభించిందని, ఇప్పుడు ఏ పనీ చేయలేని నిస్సహాయతతో ఎందుకు గెలిచామా అని బాధగా ఉందన్నారు.

* మాజీ ఎంపీపీ వై.వినోద్‌ రాజు మాట్లాడుతూ వాలంటీరు, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన తర్వాత సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారన్నారు. తెదేపా హయాంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసినప్పుడూ ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు లాలం వెంకటరమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు అమలు చేద్దామంటే నిధులు లేవు.. పోనీ ఏమైనా విలువైనా ఉందా అంటే వాలంటీరుకు ఉన్న గౌరవమైనా లేద’ని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.


జిల్లా కమిటీ ఇదే..

అనకాపల్లి జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చింతకాయల సుజాత (పరవాడ), ప్రధాన కార్యదర్శిగా మల్లే లోవరాజు (ఎస్‌.రాయవరం), ఉపాధ్యక్షులుగా సుంకర సూరిబాబు (బుచ్చెయ్యపేట), సబ్బవరపు లక్ష్మీప్రసన్న (అనకాపల్లి), కార్యదర్శిగా చదరం వెంకట సూరిగణేష్‌ నాయుడు (ఎలమంచిలి), కోశాధికారిగా బొడ్డు సత్యనారాయణ (నాతవరం) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కె.రామారావు, జనపరెడ్డి శ్రీనివాసరావు, కూండ్రపు వరలక్ష్మి సీతారామయ్య, అల్లు వెంకట ప్రసాద్‌, గొలగాని శ్రీనులను ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని