logo

హద్దులు దాటుతున్న... రౌడీషీటర్లపై ఆరా

నగరంలో హద్దుదాటి ప్రవర్తిస్తున్న రౌడీషీటర్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రతి ఆదివారం పోలీసుస్టేషన్‌కు కౌన్సెలింగ్‌ వచ్చిన తర్వాత కూడా గొడవలు, బెదిరింపులు, డబ్బుల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టటం, తమ పేరును ఉపయోగించి

Updated : 24 May 2022 05:48 IST

 గరంలో హద్దుదాటి ప్రవర్తిస్తున్న రౌడీషీటర్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రతి ఆదివారం పోలీసుస్టేషన్‌కు కౌన్సెలింగ్‌ వచ్చిన తర్వాత కూడా గొడవలు, బెదిరింపులు, డబ్బుల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టటం, తమ పేరును ఉపయోగించి గ్యాంగ్‌లను నిర్వహించే వారి వివరాలను రహస్యంగా ఆరా తీస్తున్నారు. నగర పరిధిలో సుమారు 30 నుంచి 40 మంది వరకు దందాల నిర్వహణ, ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

* నగర బహిష్కరణ విధించటం ద్వారా వారిలో కొంతైనా మార్పు వస్తుందని భావిస్తున్నారు. గతంలో పీడీ యాక్ట్‌ కింద జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా మార్పులేని వారిపై మరోసారి పీడీ యాక్ట్‌ను ప్రయోగించే యోచనలో పోలీసులు ఉన్నారు. డబ్బు సంపాదనకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వారి వివరాలను సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించిన తర్వాత సీపీ ఆదేశాలను అనుగుణంగా వీరిపై చర్యలు తీసుకోనున్నారు.

-న్యూస్‌టుడే, ఎం.వి.పి.కాలనీ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని