logo

చెత్త పన్ను రద్దయ్యే వరకు పోరు

 నగరంలో చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలని తెదేపా కార్పొరేటర్లు కోరుతున్నారు. ఈనెల 26న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయమై పట్టుపట్టాలని నిర్ణయించారు. కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో

Updated : 24 May 2022 05:48 IST
తెదేపా కార్పొరేటర్ల నిర్ణయం
సమావేశంలో పల్లా శ్రీనివాసరావు, ఫ్లోరు లీడరు పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంలో చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలని తెదేపా కార్పొరేటర్లు కోరుతున్నారు. ఈనెల 26న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయమై పట్టుపట్టాలని నిర్ణయించారు. కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో తెదేపా ఫ్లోరు లీడరు పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. కౌన్సిల్‌ సమావేశంలో పార్టీ పరంగా ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. చెత్తపన్ను రూపంలో వసూలు చేస్తున్న రూ.120ను రూ.60కు తగ్గించాలని అజెండాలో పేర్కొనగా, పార్టీ పరంగా పూర్తిగా రద్దు చేయాలనే అంశంపై పోరు సాగించాలని నిర్ణయించారు. సమావేశంలో తీనుకున్న నిర్ణయాలను తెదేపా ఫ్లోరు లీడరు పీలా శ్రీనివాసరావు వెల్లడించారు.

* వార్డుల వారీ ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు రూ.5లక్షల చొప్పున మంజూరు చేసినప్పటికీ అనేక వార్డుల్లో అవి ప్రారంభం కాలేదన్నారు. గుత్తేదారులకు నిధులు చెల్లించకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. వైకాపా కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలాన్ని 33ఏళ్ల లీజుకు కేటాయిస్తున్నందున ఇతర పార్టీలకు భూములు ఇవ్వాలని పీలా డిమాండ్‌ చేశారు. ఒక్కో వార్డుకు రూ.1.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించినా ఇంకా వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదన్నారు. డిప్యూటీ ఫ్లోరు లీడర్లు గంధం శ్రీనివాసరావు, గాడు చిన్నకుమారిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


* రెండు ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్ల (ఎఫ్‌ఆర్‌యూ) నిర్వహణకు జీవీఎంసీ ఏడాదికి రూ.2కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే జీవీఎంసీ పరిధిలో ప్రతిపాదిత 42 పట్టణ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి వస్తే వాటి అవసరం ఉండబోదన్నారు. ఈ కారణంగా ఎఫ్‌ఆర్‌యూలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని