logo

వర్షాకాలంలో ‘బూడిద గండం’

వర్షాకాలం వస్తోందంటే చాలు  థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల వద్ద ‘ఫ్లైయాష్‌పాండ్‌’ల పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతారు. వర్షాల ప్రభావంతో నీటితో కలిసి ప్రవహించే బూడిద పంటపొలాలపై మేట వేసుకుపోతుందని భయపడుతుంటారు. ఆ భూములు మళ్లీ వ్యవసాయానికి వీలుగా మార్చుకోవడానికి చాలా శ్రమించాల్సిందే. 

Published : 26 May 2022 05:36 IST

ఈనాడు, విశాఖపట్నం: వర్షాకాలం వస్తోందంటే చాలు  థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల వద్ద ‘ఫ్లైయాష్‌పాండ్‌’ల పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతారు. వర్షాల ప్రభావంతో నీటితో కలిసి ప్రవహించే బూడిద పంటపొలాలపై మేట వేసుకుపోతుందని భయపడుతుంటారు. ఆ భూములు మళ్లీ వ్యవసాయానికి వీలుగా మార్చుకోవడానికి చాలా శ్రమించాల్సిందే. 

ముప్పు ఇలా: నీటి వనరుల్లోకి ఫ్లైయాష్‌ సూక్ష్మ రేణవులు ప్రవేశిస్తే నీరు కూడా కాలుష్యం బారిన పడే ముప్పు పొంచి ఉంది.  

8 సూక్ష్మ రేణువులు క్రమంగా భూగర్భ జలాల్లోకి ప్రవేశించి అవి కూడా కలుషితం అవుతాయి. ఈ బూడిదలో ఉండే ఆర్సినిక్, లెడ్, మెర్క్యురి, సెలినియం, క్రోమియం తదితరాల కారణంగా క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ బూడిదతో ముప్పు తప్పాలంటే నిత్యం పోగుపడే నిల్వలను గణనీయంగా తగ్గించాలి. రహదారుల నిర్మాణంలో వినియోగాన్ని భారీగా ప్రోత్సహించాలి. ఇటుకలు, చిప్స్, కాంక్రీట్‌ ఉత్పత్తుల తయారీకి వినియోగించాలని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో చాలా యాష్‌పాండ్‌ల వద్ద ప్రమాదాలు జరిగినా విశాఖలోని ఎన్టీపీసీ బూడిద నిల్వల కేంద్రం వద్ద నేటి వరకు ప్రమాదాలు జరగలేదు. ఇది కొంత ఉపశమనం కలిగించే అంశం.

మూడేళ్ల నుంచి నిల్వలు తగ్గాయి: ఎన్టీపీసీ సింహాద్రికి చెందిన ఫ్లైయాష్‌ నిల్వలను జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు గణనీయంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గత మూడేళ్ల నుంచి నిల్వలు భారీగా తగ్గాయి. ఈ ఫ్లైయాష్‌ పాండ్‌ల దగ్గర ప్రమాదాలు కూడా జరగలేదు. నిల్వలు తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రమాదాలకు ఆస్కారం లేదు.

-ప్రమోద్‌కుమార్‌రెడ్డి, పర్యావరణ ఇంజినీరు, కాలుష్య నియంత్రణమండలి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని