కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టండి
కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగరపాలక సంస్థకు సంబంధించి నమోదవుతున్న కోర్టు కేసుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లక్ష్మీశ, ఏపీ హైకోర్టు ఎంఎస్సీ (మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్) ఎన్.లక్ష్మీనారాయణరెడ్డితో కలిసి వివిధ విభాగాల అధికారులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. అవగాహనతోనే కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందగలమని, కోర్టు కేసులు నమోదు కాకుండా యంత్రాంగానికి చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ కేసులు నిర్ణీత సమయాల్లో పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు. రెవెన్యూ, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నుంచి ఇటీవల పెరుగుతున్నాయన్నారు. ఎంఎస్సీ లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాస్థాయి కోర్టుల్లోనే దాదాపు పరిష్కారమయ్యేలా అధికారులు చూడాలన్నారు. మూడేళ్లు లీజు పూర్తయిన వెంటనే తిరిగి వేలం ద్వారా దుకాణాలు అప్పగించాలని, పన్నులకు సంబంధించి డిమాండ్ నోటీసులు కచ్చితంగా జారీ చేయాలన్నారు. ఏడీసీలు రమణి, శ్రీనివాసరావు, వర్మ, ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకర్, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్ఎల్జి శాస్త్రి, డీసీఆర్ నల్లనయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Y Vijaya: ఆర్థికంగా నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం విజయశాంతినే: వై.విజయ
-
Politics News
Eknath Shinde: మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఠాక్రే, పవార్‌దే బాధ్యత
-
Politics News
Andhra News: ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
General News
Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు
-
General News
Top ten news @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం