logo

నేత్రపర్వం.. అప్పన్న నిత్యకల్యాణోత్సవం

ఒడిశాకు చెందిన అప్పన్న స్వామి భక్తుడు లక్ష్మీకాంత నాయకో దాసుడు ఏటా నిర్వహించే ప్రత్యేక సేవలు నిత్య కల్యాణోత్సవంతో గురువారం ప్రారంభమయ్యాయి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దాసుడి భక్త బృందం విశేష

Updated : 27 May 2022 05:33 IST

సంపెంగ పుష్పాల అలంకరణలో దేవేరులతో స్వామివారు

సింహాచలం, న్యూస్‌టుడే: ఒడిశాకు చెందిన అప్పన్న స్వామి భక్తుడు లక్ష్మీకాంత నాయకో దాసుడు ఏటా నిర్వహించే ప్రత్యేక సేవలు నిత్య కల్యాణోత్సవంతో గురువారం ప్రారంభమయ్యాయి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దాసుడి భక్త బృందం విశేష నిత్య కల్యాణోత్సవాన్ని నిర్వహించింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై అధిష్ఠింపజేశారు. భక్త బృందం సమర్పించిన సంపెంగ, తులసి మాలలతో దేవతామూర్తులను సుందరంగా ముస్తాబు చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సింహాద్రినాథుడి నిత్య కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. దాసుడు దంపతులు స్వామికి వింజామర సేవలు చేశారు. అర్చకులు భక్తులను వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఒడిశా భక్తులు స్వామిని సంకీర్తనలతో ఆరాధించారు.

భక్త పరివారంతో ఆలయానికి విచ్చేసిన దాసుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని