logo

మహా తేజస్సు.. దేశానికి ఉషస్సు

తెలుగుదేశం శ్రేణులు ఎన్నాళ్లో వేచిన ‘మహో’దయం రానే వచ్చింది. ‘తెలుగు’ తేజం దేదీప్యమానంగా ప్రభవించింది. ఈ ఘట్టాన్ని చూసి ఒంగోలు మండువవారిపాలెం మురిసింది. శుక్రవారం ప్రాతఃకాల వేళే యువ శక్తి ఉరకలెత్తగా.. మహిళా శక్తీ అదే బాటలో

Published : 28 May 2022 03:46 IST

ఈనాడు, ఒంగోలు

తెలుగుదేశం శ్రేణులు ఎన్నాళ్లో వేచిన ‘మహో’దయం రానే వచ్చింది. ‘తెలుగు’ తేజం దేదీప్యమానంగా ప్రభవించింది. ఈ ఘట్టాన్ని చూసి ఒంగోలు మండువవారిపాలెం మురిసింది. శుక్రవారం ప్రాతఃకాల వేళే యువ శక్తి ఉరకలెత్తగా.. మహిళా శక్తీ అదే బాటలో వడివడిగా అడుగులేసింది. నేతల ప్రసంగాలు శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తూ కొత్త ఉత్సాహం నింపాయి. ఆంధ్రుల హోరుకు.. తెలంగాణ తమ్ముళ్ల జోరు తోడైందని, తెదేపా మహానాడులో ప్రతినిధుల సభే ఇలా పరవళ్లు తొక్కితే.. బహిరంగ సభ ఇక ఓ ప్రభంజనమే అవుతుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

* ఒంగోలు శివారు మండువవారిపాలెంలో శుక్రవారం నిర్వహించిన విభిన్న కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని కొండపికి చెందిన కళాకారుల బృందం ‘ఓ బాబు నీవే కావాలి... చంద్రబాబు నీవే రావాలి’ అంటూ ప్రదర్శించిన నృత్య రూపకానికి సభికుల నుంచి చప్పట్లు మార్మోగాయి.

* ఒంగోలుకు చెందిన శివకుమారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది.

* అనంతపురానికి చెందిన శంకర్‌రావు ఎన్టీఆర్‌ వేషధారణ.. హైదరాబాద్‌కు చెందిన నూకాజీ ఆంజనేయుడి రూపం అలరించింది.

* ఎన్టీఆర్‌ శత జయంతి కావడంతో ఛాయాచిత్ర ప్రదర్శనకు అభిమానులు పోటెత్తారు. ఎన్టీఆర్‌ ప్రతిమల కొనుగోలుకు పలువురు ఉత్సాహం చూపించారు.
* మాడుగుల హల్వా, ఆత్రేయపురం పూతరేకుల కొనుగోళ్లకు పోటీపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని