logo

అలాగే.. చూద్దాంలే!

ఉక్కు పరిరక్షణకు మద్దతు తెలపాలన్న పోరాట కమిటీ నాయకుల ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ ‘అలాగే..చూద్దాంలే..’ అంటూ దాటవేత సమాధానమిచ్చారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఉక్కు కర్మాగారం

Published : 28 May 2022 04:14 IST

‘ఉక్కు’పై మంత్రి బొత్స సమాధానం


కూర్మన్నపాలెం కూడలిలో మంత్రి బొత్స, తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డికి  విన్నవిస్తున్న ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు పరిరక్షణకు మద్దతు తెలపాలన్న పోరాట కమిటీ నాయకుల ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ ‘అలాగే..చూద్దాంలే..’ అంటూ దాటవేత సమాధానమిచ్చారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఉక్కు కర్మాగారం పరిరక్షణకు 470 రోజులుగా పోరాటం చేస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడం దారుణమని ఉక్కు పోరాట కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూర్మన్నపాలెం కూడలికి చేరుకోవడంతో పోరాట కమిటీ సభ్యులు బస్సుని ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే కూడలి దాటిపోయినా, లోపల ఉన్న మంత్రులు, నాయకుల సూచనతో బస్సు ఆగింది. పరుగున అక్కడకు చేరుకున్న కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, రాజశేఖర్‌, జె.అయోధ్యరామ్‌, వి.శ్రీనివాసరావు, జి.రామారావు తదితరులు ఉక్కు పరిరక్షణపై మంత్రి బొత్స, తితిదే ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా మద్దతు తెలపాలని విన్నవించగా మంత్రి పైవిధంగా స్పందిస్తూ, బస్సులోకి వెళ్లిపోవడంతో బస్సు ముందుకు కదిలింది. దీంతో కార్మికులు తీవ్ర నిరసన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని