logo

5 నుంచి ప్లాస్టిక్‌ సంచుల నిషేధం

విశాఖ నగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని కమిషనర్‌ జి.లక్ష్మీశ కోరారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న

Published : 28 May 2022 04:14 IST

మాట్లాడుతున్న కమిషనర్‌ లక్ష్మీశ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విశాఖ నగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని కమిషనర్‌ జి.లక్ష్మీశ కోరారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ సంచుల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ఇటీవల నిర్వహించిన తీర శుభ్రత కార్యక్రమంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజైన జూన్‌ 5 నుంచి నగరంలో ప్లాస్టిక్‌ సంచుల వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించామన్నారు. ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, కర్ర స్పూన్లు, పేపర్‌ గ్లాసులు వినియోగించాలని పౌరులకు అవగాహన కల్పించడంతోపాటు, ఎక్కడికక్కడ అవి లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ సంచులు వినియోగించే వారి నుంచి అపరాధ రుసుములు వసూలు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని