logo

‘గ్యాట్‌’ ఫలితాల విడుదల

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, లా, హ్యూమనిటీస్‌, నర్సింగ్‌, ఫిజియోథెరిపి, పారమెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు (2022-23 విద్యా సంవత్సరంలో) జాతీయ స్థాయిలో

Published : 28 May 2022 04:14 IST

ఫలితాలు విడుదల చేస్తున్న గీతం వీసీ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ, తదితరులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, లా, హ్యూమనిటీస్‌, నర్సింగ్‌, ఫిజియోథెరిపి, పారమెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు (2022-23 విద్యా సంవత్సరంలో) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష (గ్యాట్‌-2022) ఫలితాలను విడుదల చేసినట్లు గీతం ఉపకులపతి కె.శివరామకృష్ణ తెలిపారు. శుక్రవారం హోటల్‌ దసపల్లాలో ఫలితాలు విడుదల చేసి అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 85 పట్టణాలలో మే 20 నుంచి 26వ తేదీ వరకు అఖిల భారత స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ ఏడాది కొత్తగా విశాఖ ప్రాంగణంలో బీఎస్సీ మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ, బీఎస్సీ, ఎమర్జన్సీ మెడిసిన్‌ కోర్సులు ప్రారంభిస్తున్నామన్నారు. గ్యాట్‌-2022లో లభించిన ర్యాంకుల ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో మే 31 నుంచి మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, యూజీసీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.
బీ బెంగళూర్‌ క్యాంపస్‌లో 25శాతం సీట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం రిజర్వు చేసినట్లు పేర్కొన్నారు. గీతం ప్రవేశ పరీక్షలతోపాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించిన వారికి ఫీజులో రాయితీ ఇస్తామన్నారు. కొత్తగా క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి గీతం ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఉపకారవేతనాలు అందజేస్తామని తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 3920 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. సమావేశంలో గీతం ప్రొ వీసీ ప్రొఫెసర్‌ జయశంకర్‌, అడ్మిషన్ల డైరెక్టర్‌ పి.ఎ.వి.ఎస్‌.శేఖర్‌, రామ్‌ప్రసాద్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని