logo

అందరి భాగస్వామ్యంతో ప్రమాదాల నివారణ

పరిశ్రమల్లో భద్రతకు, ప్రమాదాల నివారణకు ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌, ఏపీ ఛాప్టర్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌

Published : 28 May 2022 04:14 IST

మాట్లాడుతున్న రాష్ట్ర ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ డి.చంద్రశేఖర్‌వర్మ, హాజరైన ప్రతినిధులు

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : పరిశ్రమల్లో భద్రతకు, ప్రమాదాల నివారణకు ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌, ఏపీ ఛాప్టర్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉక్కు ఎల్‌ అండ్‌ డీ కేంద్రం ఆడిటోరియంలో ‘బిల్డింగ్‌ రిస్క్‌ బేస్డ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ కల్చర్‌ ఇన్‌ ప్రాసెస్‌ ఇండస్ట్రీ’ అనే అంశంపై ఓ రోజు కార్యశాల నిర్వహించారు. ఉక్కు సీజీఎం(వర్క్స్‌) ఇంఛార్జి అభిజిత్‌ చక్రవర్తి మాట్లాడుతూ పరిశ్రమల్లో పని ప్రదేశంలో ప్రతి ఒక్కరూ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌, నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌, ఏపీ ఛాప్టర్‌ ఛైర్మన్‌ ఎస్‌.ఎస్‌.రావు మాట్లాడుతూ బలమైన భద్రత సంస్కృతి పెంచేలా నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ తీసుకున్న చర్యలు వివరించారు. భద్రతా విభాగం అధికారులు జె.శివశంకర్‌రెడ్డి, జి.వి.వి.ఎస్‌.నారాయణ, పి.చిన్నారావు, కె.సుధాకర్‌, ఎం.ఎస్‌.వి.కృష్ణయ్య మాట్లాడారు. విశాఖ ఫార్మా ఇండస్ట్రీస్‌, కెమికల్‌ ఇండస్ట్రీస్‌ నుంచి 240 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని