logo

ఒంటరి మహిళలకు తీరని అన్యాయం

మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరి మహిళల విషయంలో తీరని అన్యాయం చేశారని తెదేపా మహిళా విభాగ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో ని

Published : 24 Jun 2022 04:55 IST

మాట్లాడుతున్న అనిత

విశాఖపట్నం, న్యూస్‌టుడే: మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరి మహిళల విషయంలో తీరని అన్యాయం చేశారని తెదేపా మహిళా విభాగ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తూ అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒంటరి మహిళల విషయంలో వయోపరిమితి పెంచి కోత పెట్టారన్నారు. దుల్హన్‌ పథకం కింద రూ.లక్ష ఇస్తామంటూ ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఈ పథకం కింద రూ.50వేలు ఇచ్చేవారన్నారు. అమ్మఒడి పథకంలో సైతం కోతలు పెట్టడంతో లక్షలాది మంది ఆ పథకానికి దూరమయ్యారన్నారు.    
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని