logo

అత్యవసర పరిస్థితిపై నమూనా ప్రదర్శన

 ఉక్కులోని కోకోవెన్‌, కోల్‌ కెమికల్‌ ప్లాంట్‌, ఫైనల్‌ గ్యాస్‌ కూలర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే... తీసుకోవాల్సిన చర్యలపై గురువారం నిర్వహించిన మాక్‌డ్రిల్‌ ఆకట్టుకుంది. భారీ యంత్రాల సాయంతో నీరు, ఫోమ్‌ వెదజల్లి మంటలను అదుపు

Published : 24 Jun 2022 04:55 IST

మాక్‌డ్రిల్‌ వివరాలు పరిశీలిస్తున్న రాష్ట్ర జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జె.శివశంకర్‌రెడ్డి

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే :  ఉక్కులోని కోకోవెన్‌, కోల్‌ కెమికల్‌ ప్లాంట్‌, ఫైనల్‌ గ్యాస్‌ కూలర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే... తీసుకోవాల్సిన చర్యలపై గురువారం నిర్వహించిన మాక్‌డ్రిల్‌ ఆకట్టుకుంది. భారీ యంత్రాల సాయంతో నీరు, ఫోమ్‌ వెదజల్లి మంటలను అదుపు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌వింగ్‌, గ్యాస్‌ సేఫ్టీ, మెయింటినెన్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌, భద్రతా విభాగం, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది, హెచ్‌ఆర్‌ విభాగాల సిబ్బంది సమన్వయంతో పని చేశారు. రాష్ట్ర జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జె.శివశంకర్‌రెడ్డి, పి.చిన్నారావు మాక్‌డ్రిల్‌ను పర్యవేక్షించారు. ఉక్కు భద్రతా విభాగం అధికారులు ఎం.ఎస్‌.వి.కృష్ణయ్య, ఎస్‌.ఎన్‌.సింగ్‌, ఎన్‌.కె.రౌత్‌, లలన్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని