logo

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబు) చెప్పారు. దిమిలిలో గురువారం డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఉప్పలపాటి సుకుమారవర్మతో కలిసి గడపగడపకు మన

Published : 24 Jun 2022 04:55 IST

పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తిరాజు

రాంబిల్లి, న్యూస్‌టుడే: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబు) చెప్పారు. దిమిలిలో గురువారం డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఉప్పలపాటి సుకుమారవర్మతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. అంగవైకల్యంతో ఉన్న తన భర్తకు పింఛను వస్తోందని, తనకు అర్హత ఉన్నా పింఛను మంజూరు కాలేదని పేరెడ్డి పైడితల్లి, తనకు ఇల్లు మంజూరు చేయడం లేదని బొద్దపు మహేశ్వరి ఎమ్మెల్యేకు చెప్పారు. దీనిపై ఆయన గ్రామవాలంటీర్లను ప్రశ్నించారు. అర్హులకు పింఛన్లు, ఇల్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  జడ్పీటీసీ సభ్యుడు దూళి నాగరాజు, వైకాపా మండల కన్వీనర్‌ పిన్నమరాజు కిషోర్‌రాజు, పూర్వ కన్వీనర్‌ జి.వి.వి.రమణమూర్తిరాజు, పార్టీ నాయకులు డీఎస్‌ఎన్‌.రాజు, వైఎస్‌ ఎంపీపీ కొటాపు లక్ష్మి, సర్పంచి బంగారు చిలుకు, మాజీ సర్పంచి కొటాపు వడ్డికాసులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని