logo

దాడికి గురైన కార్యకర్తకు పవన్‌ ఓదార్పు

పూడిమడకకు చెందిన జనసేన నాయకుడు, పవన్‌కళ్యాణ్‌ అభిమాని ఎరిపల్లి కిరణ్‌ కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ గురువారం ఓదార్చారు. ఈ నెల 3న విశాఖ వచ్చిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబును మండ

Updated : 24 Jun 2022 06:09 IST

పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన పూడిమడకకు చెందిన ఎరిపల్లి కిరణ్‌, భార్య పిల్లలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పూడిమడకకు చెందిన జనసేన నాయకుడు, పవన్‌కళ్యాణ్‌ అభిమాని ఎరిపల్లి కిరణ్‌ కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ గురువారం ఓదార్చారు. ఈ నెల 3న విశాఖ వచ్చిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబును మండలానికి చెందిన జనసేన నాయకులు ఎరిపల్లి కిరణ్‌, సతీష్‌ కట్టెంపూడి కలిశారు. పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సుందరపు విజయ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడుతూ నిజమైన జనసేన సైనికులను వేధిస్తున్నాడని నాగబాబుకి వీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఫిర్యాదు చేశాడనే కోపంతో కిరణ్‌పై అనుచరులతో పాటు విజయ్‌కుమార్‌ దాడిచేసి తీవ్రంగా గాయపరిచారంటూ విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మత్స్యకార యువకుడిపై సుందరపు దాడి విషయం మాధ్యమాల్లో తీవ్రమైన చర్చ జరగడంతో పార్టీ పిలుపు మేరకు కిరణ్‌ రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌ వెళ్లాడు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కళ్యాణ్ని కలిశాడు. ఆయన సూచన మేరకు గురువారం భార్య పిల్లలతో సహా మరోసారి పవన్‌ను కలిసినట్లు కిరణ్‌ తెలిపారు. మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటానని, ఎవరైనా దాడిచేస్తే పూడిమడక వస్తానని భరోసా ఇచ్చారన్నారు. పవన్‌ ఓదార్చడంతో ఊరట లభించిందని కిరణ్‌ దంపతులు తెలిపారు. తమకు న్యాయం చేస్తారనే నమ్మకం కలిగిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని