logo

‘కిరణ్‌కు బంగారు భవిష్యత్తు’

ఊహించని ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు అయిన వారిందరినీ పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడిన అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన ఈగల కిరణ్‌ పదో తరగతి పూర్తిచేసి అందరి అభినందనలు పొందుతున్నాడు. స్థానిక భవానీ విద్యానికేతన్‌లో

Published : 25 Jun 2022 05:56 IST

మార్కుల మెమో అందిస్తున్న ప్రిన్సిపల్‌, కరస్పాండెంట్‌

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఊహించని ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు అయిన వారిందరినీ పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడిన అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన ఈగల కిరణ్‌ పదో తరగతి పూర్తిచేసి అందరి అభినందనలు పొందుతున్నాడు. స్థానిక భవానీ విద్యానికేతన్‌లో పదో తరగతి పూర్తిచేసి 449 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. శుక్రవారం పాఠశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్‌ని కరస్పాండెంట్‌ సంతోష్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ శ్రీలత అతడిని అభినందించి మంచి భవిష్యత్తు ఉందంటూ ధ్రువపత్రం అందించారు. మోసయ్యపేటకు చెందిన ఈగల కిరణ్‌ తల్లిదండ్రులతో పాటు 22 మంది కుటుంబ సభ్యులతో కలిసి వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తుండగా, 2015న జూన్‌ 13న అర్ధరాత్రి సమయంలో వీరు ప్రయాణిస్తున్న తుఫాన్‌ వాహనం రాజమండ్రి వద్ద ధవళేశ్వరం వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందగా, కటిక చీకట్లో ఎనిమిదేళ్ల బాలుడైన ఈగల కిరణ్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని