logo

కుటుంబ కలహాల నేపథ్యంలో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపాలపట్నం పరిసరాల్లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలేనికి చెందిన కాళ్ల సురేష్‌ (33) నేవల్‌ డాక్‌యార్డులో వెల్డర్‌గా పనిచేస్తూ

Published : 25 Jun 2022 05:56 IST

గోపాలపట్నం, న్యూస్‌టుడే: వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపాలపట్నం పరిసరాల్లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలేనికి చెందిన కాళ్ల సురేష్‌ (33) నేవల్‌ డాక్‌యార్డులో వెల్డర్‌గా పనిచేస్తూ కుటుంబసభ్యులతో నివాసమంటున్నాడు. మూడేళ్ల క్రితం చింతలగ్రహారానికి చెందిన యువతితో వివాహం కాగా, కొన్ని రోజులుగా ఇరువురి మధ్య కలహాలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో భార్యభర్తలిద్దరూ పరస్పరం గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొత్తపాలెం, చింతలగ్రహారం పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. అయినప్పటికీ మనస్తాపంతో సురేష్‌ గురువారం అర్థరాత్రి ఫ్యాన్‌హుక్‌కు ఉరిపోసుకున్నాడు. తెల్లవారి గది తలుపుతెరిచి చూసేసరికి అతడు విగతజీవిగా పడిఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామాకు కేజీహెచ్‌కు తరలించారు. ● జీవీఎంసీ 89వ వార్డు నాగేంద్రకాలనీకి చెందిన సూదికొండ కనకరాజు (25) దోభీగా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా భార్యతో తరచూ వివాదాలకు దిగుతుండడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌హుక్‌కు చీరతో ఉరిపోసుకుని మృతిచెందాడు. అతడి తండ్రి సూరిబాబు తెల్లవారి ఇంటికి వెళ్లి చూసేసరికి కనకరాజు విగతజీవిగా కనిపించడంతో గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని