logo

తెదేపా వాళ్లను తన్ని తోసేయండి

 తెదేపాకు చెందినవారిని మండల పరిషత్తు సమావేశం నుంచి తన్ని తోసేయాలని వైకాపాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు అధికార దురహంకారాన్ని ప్రదర్శించాడు. అచ్యుతాపురం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోన సంధ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.

Published : 28 Jun 2022 06:32 IST

వైకాపా ఎంపీటీసీ సభ్యుడు లాలం శ్రీను


మండల సమావేశంలో తెదేపా, వైకాపా సభ్యుల వాగ్వాదం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తెదేపాకు చెందినవారిని మండల పరిషత్తు సమావేశం నుంచి తన్ని తోసేయాలని వైకాపాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు అధికార దురహంకారాన్ని ప్రదర్శించాడు. అచ్యుతాపురం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోన సంధ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రామన్నపాలెం సర్పంచి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడుబాబు (డ్రీమ్స్‌ నాయుడు), దిబ్బపాలెం సెజ్‌కాలనీ ఎంపీటీసీ సభ్యుడు నీరుకొండ నర్సింగరావు, వెదురువాడ సర్పంచి కొయ్యా శ్రీనివాసరావు సభ్యులుగా హాజరయ్యారు. వేదికపై ఎంపీపీ కోన సంధ్యతోపాటు జడ్పీటీసీ కో-ఆప్షన్‌ సభ్యుడు నర్మాల కుమార్‌ ఉండటంపై డ్రీమ్స్‌ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏమైనా ఉంటే చూపాలని ఎంపీడీఓ నిర్మలాదేవిని అడిగారు. నిబంధనల ప్రకారమే కో-ఆప్షన్‌ సభ్యుడిని వేదిక మీద ఉంచామని, ఆదేశాలు చూపిస్తామని ఎంపీడీఓ సమాధానం చెప్పారు. ఇంతలో చోడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు లాలం శ్రీను ఆవేశంగా మాట్లాడుతూ అభివృద్ధి గురించి మాట్లాడడానికి వచ్చారా? వేదికపై ఎవరిని కూర్చోబెట్టాలో తెలుసుకోవడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా సభ్యులను తన్ని తోసేయండి అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. తెదేపా సభ్యులకు కొందరు వైకాపా సభ్యులు సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తుండగా జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు నర్మాల కుమార్‌ వేదిక దిగి దిబ్బపాలెం సెజ్‌ కాలనీ ఎంపీటీసీ సభ్యుడు నర్సింగరావు ఒకే భూమికి రెండుసార్లు రూ. 33 లక్షలు పరిహారం తీసుకొని సభలో మాత్రం నీతిమంతుడిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా సభ్యుల తీరుకు నిరసన తెలుపుతున్నామంటూ తెదేపా సభ్యులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని