logo

కేజీహెచ్‌కు కొవిడ్‌ కేసుల తాకిడి

కేజీహెచ్‌కు కొవిడ్‌ కేసుల తాకిడి మొదలైంది. బాధితుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా ఆసుపత్రికి వచ్చి చేరుతున్నారు. కేజీహెచ్‌లో ఓ మెడికోకు, మరో ఇద్దరు వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. ప్ర

Published : 28 Jun 2022 06:32 IST

ఇద్దరు వైద్యులకు పాజిటివ్‌

కేజీహెచ్‌లోని ఐసొలేషన్‌ వార్డు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌కు కొవిడ్‌ కేసుల తాకిడి మొదలైంది. బాధితుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా ఆసుపత్రికి వచ్చి చేరుతున్నారు. కేజీహెచ్‌లో ఓ మెడికోకు, మరో ఇద్దరు వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. ప్రసూతి విభాగంలో చికిత్స పొందుతున్న గర్భిణుల్లో అయిదుగురికి కొవిడ్‌ సోకింది. మిగిలిన వారి నుంచి వీరిని వేరు చేసి ఐసొలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ, ఇతర వార్డుల్లో చికిత్స పొందుతున్న కొంత మందికి వైరస్‌ సోకింది. వీరిని ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాకినాడ నుంచి కొంతమంది బాధితులు ఇక్కడికి వచ్చారు. ఇంతకాలం కొవిడ్‌ రోగులకు పూర్తిస్థాయి వసతులతో సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో చికిత్స అందించేవారు. కేసుల తీవ్రత తగ్గడంతో సీఎస్‌ఆర్‌ బ్లాకును క్యాన్సర్‌, సర్జికల్‌ విభాగాలకు కేటాయించారు. ఇప్పుడు కొవిడ్‌ కేసులు వస్తున్నందున రాజేంద్రప్రసాద్‌ వార్డులోని ఒక బ్లాక్‌ను బాధితులకు కేటాయించాలని ఆసుపత్రి వైద్యాధికారులు నిర్ణయించారు. ఆ వార్డులోని వసతులను ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్‌ మైథిలి, ఉప పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జ్ఞానసుందర్రాజు సోమవారం పరిశీలించారు.

ఎటువంటి లక్షణాలు లేకుండా కొంతమందిలో కొవిడ్‌ నిర్ధా.రణ అవుతోంది. మరికొందరిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ముందు చూపుతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఐసొలేషన్‌ వార్డులో బాధితులకు చికిత్స అందించనున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో 95 మందికి పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. 8 మంది కోలుకోగా, 215 మంది చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని