logo

‘కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలి’

: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలలో కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ఓ హోటల్‌లో కాపు సంఘం ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు

Published : 28 Jun 2022 06:53 IST


సంఘీభావం తెలుపుతున్న కాపు సంఘం నాయకులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలలో కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ఓ హోటల్‌లో కాపు సంఘం ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ తాము ఏ పార్టీనీ విమర్శించబోమని అన్నారు. జనాభా ప్రాతిపదికన కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని కోరుతున్నామన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నాలుగు సీట్లు కేటాయించగా, నాలుగింటిలోనూ విజయం సాధించామన్నారు. తెదేపా, వైకాపా పార్టీలు కూడా తమకు కేటాయిస్తున్న సీట్లను గెలుపించుకుంటూ వస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాలలో కాపుల ఓటు శాతం అధికంగా ఉందన్నారు. సంఘం కార్యదర్శి బొండా అప్పారావు, కంపర సత్తిబాబు, మురళీకృష్ణ, నారాయణరావు, సన్యాసిరావు, శ్రీహరి, కంపర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని