logo

2022-23లో రూ.7,500 కోట్ల లావాదేవీల లక్ష్యం

దక్షిణాది రాష్ట్రాల అర్బన్‌ సహకార బ్యాంకుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ‘ది విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌’ (వీసీబీఎల్‌) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్ల లావాదేవీలే లక్ష్యంగా పనిచేస్తుంది’ అని

Published : 29 Jun 2022 03:42 IST

వీసీబీఎల్‌ ఛైర్మన్‌ చలసాని


మాట్లాడుతున్న చలసాని రాఘవేంద్రరావు, పక్కన మానం ఆంజనేయులు, ఇతర డైరెక్టర్లు

సీతంపేట, న్యూస్‌టుడే :‘దక్షిణాది రాష్ట్రాల అర్బన్‌ సహకార బ్యాంకుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ‘ది విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌’ (వీసీబీఎల్‌) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్ల లావాదేవీలే లక్ష్యంగా పనిచేస్తుంది’ అని ఆ బ్యాంకు ఛైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. విశాఖ నగర కేంద్రంగా 1916 ఫిబ్రవరి ఐదున కార్యకలాపాలు ప్రారంభించిన బ్యాంకు 106 ఏళ్లు పూర్తిచేసుకొందన్నారు. మంగళవారం ఆయన బ్యాంకు ఎమెరిటస్‌ చైర్మన్‌ మానం ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ గుడివాడ భాస్కరరావు, డైరెక్టర్లు ఎ.జె.స్టాలిన్‌, కాకి భవాని, సిరువూరి జానకీ రామచంద్రరాజు, ఉప్పలపాటి పార్వతీదేవి, సీహెచ్‌. ఆదినారాయణ శాస్త్రి, ముఖ్య కార్యనిర్వాహక అధికారి పి.వి.నరసింహ మూర్తి, జనరల్‌ మేనేజర్‌ ఎ.వి.రామకృష్ణరావు, పర్యవేక్షణాధికారి ఎ.రామకృష్ణరావు తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. 2021-22 నాటికి 92200 మంది సభ్యులతో రూ.272 కోట్ల షేరు ధనం కలిగి ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ అగ్రగామిగా తమ బ్యాంకు నిలిచిందన్నారు. 2625మంది సభ్యులకు రూ.6.62కోట్లు ఆర్థిక సహాయం అందజేసినట్లు వివరించారు. ఈ ఏడాది సభ్యులకు వారి షేరుధనంపై రూ.24.98 కోట్ల డివిడెండ్‌ చెల్లించామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 46, తెలంగాణ(హైదరాబాద్‌)లో నాలుగు బ్రాంచీలతో బ్యాంకు నడుస్తోందని, కొత్తగా మరో ఆరు బ్రాంచీల ఏర్పాటుకి రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేశామన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేయడానికి పాలక వర్గం ఆమోదించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని