logo

డీఎంహెచ్‌వోపై విచారణ!

విశాఖ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆమె గతంలో విజయనగరం జిల్లాలో డీఎంహెచ్‌వోగా, నర్సీపట్నంలో

Published : 29 Jun 2022 03:42 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విశాఖ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆమె గతంలో విజయనగరం జిల్లాలో డీఎంహెచ్‌వోగా, నర్సీపట్నంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ శాఖ డైరెక్టర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. ఇటీవల కొన్ని పోస్టుల భర్తీలోను లొసుగులు జరిగాయని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై నెలలో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని జోనల్‌ మలేరియా అధికారి డా.తిరుపతిరావును నియమించారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో విజయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఇటీవల కొంతమంది డిప్యుటేషన్లు రద్దుచేశామని, దీంతో ఎవరో తనపై బురద జల్లాలనే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు తెలిసిందన్నారు. కనీసం ఫిర్యాదు చేసింది ఎవరనేది బయటపెట్టలేకపోవడమే దీనికి ఉదాహరణన్నారు. అసలు ఈ ఫిర్యాదుదారులు ఎవరో ముందు తెలుసుకోమన్నారు తప్ప విచారణ కాదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని