logo
Published : 29 Jun 2022 03:42 IST

‘జల్‌జీవన్‌’తో నీటి సరఫరాలో పారదర్శకత

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్‌, చిత్రంలో కలెక్టర్‌ మల్లికార్జున, తదితరులు

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: గ్రామాల్లో జవాబుదారీతనం, పారదర్శకత గల నీటి వ్యవస్థను రూపొందించడమే జల్‌ జీవన్‌ మిషన్‌ ముఖ్య లక్ష్యమని జల్‌జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్‌ పేర్కొన్నారు. రుషికొండలోని ఓ ప్రయివేటు రిసార్ట్స్‌లో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం అమలుపై మంగళవారం నిర్వహించిన జోనల్‌స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జునతో కలిసి ప్రారంభించారు. ప్రదీప్‌సింగ్‌ మాట్లాడుతూ గ్రామాల్లో స్థానిక సంస్థలు భాగస్వామిగా మాత్రమే ఈ పథకం అమలు సాధ్యమన్నారు. రాబోయే 30 నుంచి 40 సంవత్సరాలకు అవసరమయ్యే ప్రణాళికలతో ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఈ పథకం ద్వారా కుళాయి కనెక్షను మంజూరు చేస్తామన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 2024 సంవత్సరం నాటికి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో జిల్లాల్లో అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం అమలు, సాధించిన ప్రగతి తదితర ముఖ్యాంశాలను కలెక్టర్‌తో పాటు జోన్‌-1 పరిధిలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంయుక్త కలెక్టర్లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఇంజినీర్లు ఆర్‌.వి.కృష్ణారెడ్డి, గాయత్రీ దేవి, రవికుమార్‌, డీఈలు, జేఈలు తదితర జోనల్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని