logo
Published : 29 Jun 2022 03:42 IST

తాళం చూస్తాడు.. మాయం చేస్తాడు

దొంగ అరెస్టు.. 25 వాహనాలు స్వాధీనం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం పార్కింగ్‌ చేసి తాళం తీయకుండా బండికే విడిచి వెళ్లారా... ఇక అంతే సంగతులు.. బండిని క్షణాల్లో మాయం చేసేస్తాడు. ఈ విధంగా 25 వాహనాలను అపహరించిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇందుకు సంబంధించి ఏడీసీపీ(క్రైమ్‌) గంగాధరం తెలిపిన వివరాలు ఇవి. జనవరి 28న తరుణ్‌కుమార్‌ అనే వ్యక్తి ద్వారకానగర్‌లోని ఓ కళాశాలలో వాహనాన్ని పార్కింగ్‌ చేసి తాళం వేయకుండా లోపలకి వెళ్లాడు. వచ్చే సరికి వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే...నగరంలో పలు ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు ఒక బృందంగా ఏర్పడి నిఘా పెట్టారు. చేపలుప్పాడకు చెందిన చినమాన ఎల్లాజీ (34) అనే వ్యక్తిపై అనుమానం రావడంతో ద్వారకానగర్‌లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవటంతో అతని నుంచి 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

* డిగ్రీ చదివిన ఎల్లాజీ చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ తరహా నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అపహరించిన వాహనాల్లో కొత్తవి కూడా ఉండటం గమనార్హం. తన కుటుంబసభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నమ్మించి వాహనాలను తాకట్టు పెట్టి నగదు తీసుకుని జల్సాలు చేసేవాడు. అయితే తాకట్టు పెట్టిన తర్వాత నెలవారీ వడ్డీలు కడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాల్లో మూడు పల్సర్‌లు ఉండగా, మిగిలినవి యాక్టీవా తర మోడల్‌ వాహనాలే కావటం విశేషం.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని