logo

భద్రతకు లేదు భరోసా..!

పరిశ్రమల రాజధానిగా పేరొందిన విశాఖలో... ఇటీవల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆయా ప్రమాద ఘటనల్లో బాధితులకు సంస్థల యాజమాన్యాలు/ ప్రభుత్వాలు పరిహారం అందిస్తున్నాయే గాని, పూర్తిస్థాయిలో భద్రతకు భరోసా ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Published : 30 Jun 2022 05:49 IST

పరిశ్రమల ప్రమాద ఘటనల్లో పరిహారానికే మొగ్గు..
న్యూస్‌టుడే, సింధియా

హిందుస్థాన్‌ షిప్‌యార్డు ముఖద్వారం

పరిశ్రమల రాజధానిగా పేరొందిన విశాఖలో... ఇటీవల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆయా ప్రమాద ఘటనల్లో బాధితులకు సంస్థల యాజమాన్యాలు/ ప్రభుత్వాలు పరిహారం అందిస్తున్నాయే గాని, పూర్తిస్థాయిలో భద్రతకు భరోసా ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనల ప్రకారం పరిశ్రమలు/కర్మాగారాల్లో ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేయాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఎక్కడా బిగించడం లేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత కాలానికి అనుగుణంగా భద్రత సమావేశాలు నిర్వహించని యాజమాన్యాలపైనా ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

 తరచూ జరిగే ప్రమాదాలు..
జు విశాఖ ఉక్కు కర్మాగారంలో హాట్‌మెటల్‌ పడిపోవడం, బ్లాస్ట్‌ఫర్నేస్‌ల వద్ద విద్యుదాఘాతాలు చోటు చేసుకుంటున్నాయి.
* ఫార్మాసిటీ, రసాయన ఉత్పత్తి పరిశ్రమల్లో ప్రతి నెలా కనీసం రెండు మూడు ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కువగా విషవాయువులు లీకై.... కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
* హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో కూలింగ్‌ టవర్లు కూలడం, ఎంఎస్‌ బ్లాకుల వద్ద లీకులు ఏర్పడి.. ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రమాదాల బారిన పడ్డారు.
* హిందుస్థాన్‌ షిప్‌యార్డులో 2020 ఆగస్టులో భారీ క్రేను కూలి పది మంది మృతి చెందారు.
ఇటీవల డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్‌ నిర్మాణంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ఘటనలు పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యమే అని కార్మికవర్గాలు వాపోతున్నాయి.
* వీటిల్లో చాలా ప్రమాదాలు సరైన భద్రత విధానాలు అమలు చేయకపోవడంతోనే జరుగుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దీనికితోడు పరిహారంలోనూ పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు.
  పక్కాగా సమీక్షలు
జు పరిశ్రమల్లో ప్రతి మూడు నెలలకు భద్రతపై సమీక్షలు నిర్వహించి, లోపాలను సరి చేయాల్సి ఉంటుంది.
సమీక్షలో సంస్థ/కంపెనీ భద్రతా విభాగం అధికారి, ఇద్దరు గుత్తేదారులు, అయిదుగురు కార్మిక సంఘాల నాయకులు, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌, పరిశ్రమల్లోని వివిధ విభాగాధిపతులు కలిసి కనీసంగా 20 నుంచి 25 మంది సభ్యులు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
* సమీక్షలో చర్చించిన అంశాలను ఎప్పటికప్పుడు సత్వరం అమల్లోకి తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందని, ఇది అందరి బాధ్యతగా భావించాలని వారు చెబుతున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని