logo

ప్రపంచస్థాయిలో ఎలమంచిలికి పేరు తెస్తా

ఒలింపిక్స్‌లో ఆడి ప్రపంచస్థాయిలో ఎలమంచిలి పేరు తేవాలన్నదే తన ధ్యేయమని హాకీ క్రీడాకారిణి మడగల భవాని చెప్పారు. ఐర్లాండ్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఆమె బుధవారం స్వగ్రామానికి చేరుకున్నారు.

Updated : 30 Jun 2022 06:38 IST

ఎలమంచిలిలో కేక్‌ కట్‌చేస్తున్న హాకీ క్రీడాకారిణి భవాని

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఒలింపిక్స్‌లో ఆడి ప్రపంచస్థాయిలో ఎలమంచిలి పేరు తేవాలన్నదే తన ధ్యేయమని హాకీ క్రీడాకారిణి మడగల భవాని చెప్పారు. ఐర్లాండ్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఆమె బుధవారం స్వగ్రామానికి చేరుకున్నారు. స్థానిక హాకీ క్రీడాకారులు ఎలమంచిలి రాజీవ్‌ క్రీడామైదానంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేశారు. ఐర్లాండ్‌ పోటీల్లో ఆటలో మెలకువలు మరింత నేర్చుకున్నానన్నారు. క్రీడా కోటాలో రైల్వేలో ఉద్యోగం సంపాదించాలన్నదే తన లక్ష్యమని ఆమె మనోగతాన్ని వివరించారు. తాను ఆర్థికంగా స్థిరపడ్డాక స్థానిక హాకి క్రీడాకారులను మెరుగ్గా తీర్చిదిద్దడానికి కృషిచేస్తానన్నారు. ఎలమంచిలిలో అకాడమీ అవసరం చాలా ఉందన్నారు. 20 ఏళ్ల వయస్సులోనే భారత్‌ జట్టు తరఫున ఆడే అవకాశం రావడం జీవితంలో మరచిపోలేని అనుభవం అన్నారు. ఎలమంచిలి హాకీ అసోసియేషన్‌ సభ్యులు కొఠారు నరేష్‌, కె.సాయిరాం, డి.మహేష్‌, పి.శివ, ఆడారి వీరినాయుడు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని