logo

బాలికలకు బాసట

నిరుపేద బాలికలకు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్‌లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన లభించడంతో పలువురు బాలికలు పోటీ పడుతున్నారు. వీటిలో ఇంటర్‌ మొదటి ఏడాదిలో దరఖాస్తులను బుధవారం నుంచి స్వీకరిస్తున్నారు. జులై 12  వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

Updated : 30 Jun 2022 06:28 IST

దరఖాస్తులకు అవకాశం 12 వరకు

నిరుపేద బాలికలకు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్‌లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన లభించడంతో పలువురు బాలికలు పోటీ పడుతున్నారు. వీటిలో ఇంటర్‌ మొదటి ఏడాదిలో దరఖాస్తులను బుధవారం నుంచి స్వీకరిస్తున్నారు. జులై 12  వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  నిబంధనల ప్రకారం సీట్లు కేటాయింపు ఉంటుంది. ఏ బాలికకు ఎక్కడ సీటు కేటాయించారో వారి సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తుంది. దీంతో పాటు సీట్లు పొందిన వారి వివరాలను ఆయా పాఠశాలల ఆవరణలోని నోటీసు బోర్డులో పెడతారు. ఒక్కొక్క కస్తూర్బా విద్యాయంలో ఇంటర్‌లో ఒకటే గ్రూపు ఉంటుంది. వాటిలో 40 సీట్లు భర్తీ చేయనున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 34 కేజీబీవీల్లో వివిధ గ్రూపుల్లో చేరడానికి 1360 సీట్లను ఈ విద్యా సంవత్సరంలో కేటాయించారు.


దరఖాస్తు చేసుకోడానికి అర్హత
* పదో తరగతి పాసై ఉండాలి
* అనాథలు (తల్లిదండ్రులు లేని బాలికలు), పాక్షిక అనాధలు (కేవలం తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న వారు), దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారిలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారు.
* దరఖాస్తు చేచే సమయంలో బాలిక ఆధార్‌ కార్డుతో పాటు పదో తరగతి హాల్‌టికెట్‌ జాత చేయాలి.



ఆన్‌లైన్‌ ద్వారా సీట్ల కేటాయింపు
దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో పెడతారు. రాష్ట్ర సమగ్ర శిక్ష పథక సంచాలకుల ఆదేశాలను అనుసరించి సీట్ల భర్తీ జరుగుతుంది. బాలికలకు క్రమ శిక్షణతో కూడిన నాణ్యమైన విద్య, పోషక విలువలతో ఉన్న ఆహారాన్ని ఉచితంగా అందిస్తాం. జులై 12 లోగా దరఖాస్తులు చేసుకోవాలి. సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా జరుగుతుంది.
-రాజేశ్వరి, జీసీడీఓ, విశాఖ జిల్లా



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని