logo

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మహిళాభివృధ్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. పెందుర్తిలోని స్వధార్‌ గృహాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి

Published : 30 Jun 2022 06:10 IST

 మంత్రి ఉషశ్రీచరణ్‌

చిన్నారికి అన్నప్రాసన చేస్తున్న మంత్రి ఉషశ్రీ

పెందుర్తి, న్యూస్‌టుడే: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మహిళాభివృధ్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. పెందుర్తిలోని స్వధార్‌ గృహాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వధార్‌ గృహాల్లో ఆశ్రయం పొందే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు.  ఇక్కడి మహిళల విన్నపం మేరకు త్వరలోనే వారి సొంత ఇళ్లకు పంపే ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పెందుర్తి మండలంలోని రాతిచెరువు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ జి.చిన్మయీదేవి, ప్రాంతీయ ఆర్గనైజర్‌ ఎం.మాధవీవర్మ, పీడీ పద్మావతి, కనకదుర్గ, సీడీపీవో సంతోషికుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని