logo

ఆ ఇద్దరు మహిళల ప్రమేయం ఎంత?

నగరంలోని కేజీహెచ్‌ సమీపంలో ఇటీవల ఒక వ్యక్తిపై జరిగిన దాడి ఉదంతం ఊహించని మలుపులు తిరుగుతోంది. తొలుత దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. దీంతో కేసును ‘హత్యాయత్నం’గా మార్చినట్లు సమాచారం.

Published : 05 Jul 2022 04:28 IST

మలుపులు తిరుగుతున్న దాడి కేసు 

ఇప్పటికే కానిస్టేబుల్‌ అరెస్ట్‌

ఈనాడు, విశాఖపట్నం: నగరంలోని కేజీహెచ్‌ సమీపంలో ఇటీవల ఒక వ్యక్తిపై జరిగిన దాడి ఉదంతం ఊహించని మలుపులు తిరుగుతోంది. తొలుత దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. దీంతో కేసును ‘హత్యాయత్నం’గా మార్చినట్లు సమాచారం. ఆ దాడి వ్యవహారంలో నిందితుడికి ఓ కానిస్టేబుల్‌ సహకరించాడని సమాచారం అందడంతో అతని పాత్రపై కూడా దర్యాప్తు చేశారు. బాధితుడితో అతనికి ఎలాంటి వ్యక్తిగత వైరం లేకపోయినప్పటికీ ఇతరుల ఒత్తిడితో దాడి వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండుకు పంపారు.  దాడికి దారి తీసిన కారణాలేమిటన్న అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. బాధితుడితో ఓ మహిళకు ఉన్న వైరం ఈ ఘటనకు దారితీసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ మహిళకు మరో మహిళ కూడా సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కీలకమైన ఉద్యోగ స్థానాల్లో ఉన్న ఆ ఇద్దరు మహిళలపై తమకు అందిన సమాచారం వాస్తవమా? కాదా? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. వారి పాత్ర నిరూపించే  సాక్ష్యాధారాలకు అన్వేషిస్తున్నారు. కేసులో కీలకమైన కొందరు పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని