logo

బస్సులో మేయర్‌.. సైకిల్‌పై కమిషనర్‌

‘ప్రతి సోమవారం..వాహన రహితం’ కార్యక్రమానికి తొలిరోజు స్పందన లభించింది. మేయరు గొలగాని హరి వెంకట కుమారి పెద గదిలిలోని నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో వెంకోజీపాలెం వరకు ప్రయాణించారు. అక్కడి నుంచి మరో బస్సులో బీచ్‌రోడ్డులోని అల్లూరి సీతారామ రా

Updated : 05 Jul 2022 06:48 IST

‘సోమవారం..వాహన రహితానికి’ స్పందన

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మేయరు గొలగాని హరి వెంకట కుమారి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ‘ప్రతి సోమవారం..వాహన రహితం’ కార్యక్రమానికి తొలిరోజు స్పందన లభించింది. మేయరు గొలగాని హరి వెంకట కుమారి పెద గదిలిలోని నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో వెంకోజీపాలెం వరకు ప్రయాణించారు. అక్కడి నుంచి మరో బస్సులో బీచ్‌రోడ్డులోని అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్దకెళ్లి నివాళులర్పించారు. అక్కడ్నుంచి ఆటోలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ ఉదయం 9 గంటల సమయంలో క్యాంపు కార్యాలయం నుంచి సైకిల్‌పై ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేయడానికి సైకిల్‌పై తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సోమవారమంతా ఆయన సైకిల్‌పై ప్రయాణ సాగించారు.

బోసిపోయిన సెల్లార్‌

ద్విచక్రవాహనాలను లోనికిఅనుమతించకపోవడంతో జీవీఎంసీ సెల్లార్‌ బోసిపోయింది. కమిషనర్‌ ఆదేశాలతో కార్లు వదిలేసి అధికారులు వచ్చారు. కొంత మంది ద్విచక్రవాహనాలపై కార్యాలయం వరకు వచ్చి, బయట పార్కింగ్‌ చేసి లోపలికి వెళ్లారు. దీంతో కార్యాలయం చుట్టూ  వాహనాలే కనిపించాయి జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, శరగడం రాజశేఖర్‌ బయట కార్లు వదిలిపెట్టి లోపలికి వచ్చారు. వాహనాల నిషేధం మొదటి సోమవారం విజయవంతమైనా, ద్విచక్రవాహనాలు, కార్లు కార్యాలయం బయట వరకు తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కమిషనర్‌ దృష్టిపెట్టి అందరూ ఆర్టీసీ, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

క్యాంపు కార్యాలయం నుంచి సైకిల్‌పై వస్తున్న కమిషనర్‌ లక్ష్మీశ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని