logo
Published : 05 Jul 2022 04:28 IST

గదులెక్కడ... వసతులెలా!

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు పెరుగుతున్న రద్దీ

-ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, కొమ్మాది

మహారాణిపేట దండుబజార్‌లోని ఎంవీడీ హైస్కూల్‌లో నూతన ప్రవేశాలకు వచ్చిన విద్యార్థులు, కుటుంబీకులు

విశాఖ నగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాఠశాలలు ఈ నెల 5వ తేదీనుంచి పునఃప్రారంభమవుతున్నా...గత నాలుగు రోజుల నుంచే తమ బిడ్డలను తీసుకొని తల్లిదండ్రులు వస్తున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రైవేటుగా మారడం...కొన్ని మూత పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అధిక ఫీజులు చెల్లించుకోలేని పేదలు తమకు దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతో వచ్చిన వారి నుంచి ఉపాధ్యాయులు దరఖాస్తులు తీసుకొని మళ్లీ కబురు చేస్తామంటున్నారు. కొన్ని చోట్ల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రవేశ దరఖాస్తులు వస్తుండటంతో కొన్ని చోట్ల ఇప్పుడున్న వసతులు ఏమాత్రం సరిపోవని ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. మధురవాడ, మహారాణిపేట, మధురానగర్‌ ప్రాంతాల్లో జీవీఎంసీ పాఠశాలలకు పెద్ద   ఎత్తున నూతన ప్రవేశ దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి. మంగళవారం నుంచి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మధురవాడలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో గత నాలుగు రోజుల్లో దాదాపు 170 మంది ప్రవేశాలు పొందారు. వీరిలో ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారు 90 మంది ఉంటారని చెబుతున్నారు. నెలాఖరు వరకు ప్రవేశాలు ఉంటే ప్రస్తుత 3,482 మంది విద్యార్థుల సంఖ్య  5,000 చేరొచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని