logo

హిందుస్థాన్‌ షిప్‌యార్డు టర్నోవర్‌ రూ.759 కోట్లు

హిందుస్థాన్‌ షిప్‌యార్డు రూ.759 కోట్ల టర్నోవర్‌ సాధించిందని సంస్థ సీఎండీ కమొడోర్‌ హేమంత్‌ఖత్రీ తరఫున  యాజమాన్యం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ‘ఆత్మనిర్బర్‌’ నినాదం అందిపుచ్చుకొని ప్రభుత్వ సహకారంతో ఏడాదిలో రూ.50 కోట్ల నికర లాభాలను

Published : 05 Jul 2022 04:28 IST

సింధియా, న్యూస్‌టుడే : హిందుస్థాన్‌ షిప్‌యార్డు రూ.759 కోట్ల టర్నోవర్‌ సాధించిందని సంస్థ సీఎండీ కమొడోర్‌ హేమంత్‌ఖత్రీ తరఫున  యాజమాన్యం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ‘ఆత్మనిర్బర్‌’ నినాదం అందిపుచ్చుకొని ప్రభుత్వ సహకారంతో ఏడాదిలో రూ.50 కోట్ల నికర లాభాలను ఆర్జించిందని వెల్లడించారు. ఈ వృద్ధి 60%గా ఉందని స్పష్టం చేశారు. నౌకల నిర్మాణం, మరమ్మతులకు తూర్పు సాగర మండలి (ఈస్ట్రన్‌ సీబోర్డు)లో హెచ్‌ఎస్‌ఎల్‌ శీఘ్ర అభివృద్ది దిశగా పయనిస్తుందన్నారు. ఈ ఏడాది డిసెంబరులో సంస్థకు అయిదు ఫ్లీట్‌ సపోర్టు నౌకల(ఎఫ్‌ఎస్‌ఎస్‌) నిర్మాణానికి రూ.20,000 కోట్ల విలువైన భారీ ఆర్డరు రానుందని చెప్పారు. నౌకల మరమ్మతులతో రూ.230 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నాలుగు ‘బొలార్ట్‌ టగ్‌’ లను మూడు నెలలకొకటి చొప్పున యాజమాన్యాలకు సకాలంలో అప్పగించామన్నారు. వీటితో పాటు మరో రెండు విదేశీ నౌకలకు మరమ్మతులు చేశామన్నారు.  అంతర్జాతీయ పోటీని ఎదుర్కొని మరింత వేగవంతంగా పనులు చేస్తున్నామని సంస్థ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని