logo

ఆరోపణలున్నా అందలమే...!

మహావిశాఖ నగర పాలక సంస్థలో ఇటీవల జరిగిన బదిలీల్లో పైరవీలకే పెద్దపీట వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకున్న కొందరికి, ఇతర ప్రాంతాల నుంచి జీవీఎంసీకి రావడానికి ప్రయత్నాలు చేసిన పలువురికి బదిలీలు జరగడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి

Updated : 05 Jul 2022 04:59 IST

జీవీఎంసీ బదిలీల్లో ఇష్టారాజ్యం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహావిశాఖ నగర పాలక సంస్థలో ఇటీవల జరిగిన బదిలీల్లో పైరవీలకే పెద్దపీట వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకున్న కొందరికి, ఇతర ప్రాంతాల నుంచి జీవీఎంసీకి రావడానికి ప్రయత్నాలు చేసిన పలువురికి బదిలీలు జరగడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో నీటి సరఫరా విభాగంలో పని చేసి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి మళ్లీ ఇక్కడికి వస్తున్నారు.  జీవీఎంసీ భూగర్భ మురుగునీటి వ్యవస్థలో ఐదేళ్లకుపైగా పనిచేసి రెండేళ్ల క్రితం బదిలీ అయిన ఓ అధికారి మళ్లీ నగరానికి బదిలీ అయ్యారు. ఇప్పటికే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన కొందరు ఇంజినీర్లకు ఇక్కడి నుంచి బదిలీ జరగకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* ఓ కీలక అధికారి మూడేళ్ల కిందట వీఎంఆర్‌డీఏకి బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరిగి జీవీఎంసీకి వచ్చేశారు. వీఎంఆర్‌డీఏ నుంచి బదిలీపై వస్తున్న మరో అధికారి గతంలో జీవీఎంసీలో పని చేశారు.  ఏడాదిన్నర క్రితం ఇక్కడి నుంచి మరో జిల్లాలోని పురపాలక సంఘానికి కమిషనర్‌గా వెళ్లిన అధికారి తిరిగి జీవీఎంసీకి వస్తున్నారు. ఏడాదిన్నర క్రితం నగరంలో పనిచేసిన సందర్భంలో ఆయనపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయినా ఇక్కడికి బదిలీ చేయడంపై జీవీఎంసీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. జీవీఎంసీ ఇంజినీరింగ్‌ విభాగానికి బదిలీపై వస్తున్న వారిలో పలువురు ఏడాదిన్నర, రెండేళ్ల క్రితం ఇక్కడ పని చేసిన వారే కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు