logo

భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి.. అల్లూరి

యుక్త వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్‌ ఎ. మల్లికార్జున అన్నారు. పాండ్రంగి గ్రామంలో సోమవారం నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ముందుగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Published : 05 Jul 2022 04:28 IST

పద్మనాభం, న్యూస్‌టుడే: యుక్త వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్‌ ఎ. మల్లికార్జున అన్నారు. పాండ్రంగి గ్రామంలో సోమవారం నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ముందుగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. అల్లూరి చరిత్ర నేటి తరానికే కాక భవిష్యత్తు తరాలకూ స్ఫూర్తిదాయకమన్నారు. ఇక్కడి వంతెన నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీతారామరాజు జీవించింది తక్కువ సంవత్సరాలే అయినా ఆయన కీర్తి ఎన్నో తరాలు నిలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి  మాట్లాడారు. అనంతరం అమ్మఒడి పథకం చెక్కును పంపిణీ చేశారు. స్థానిక పాఠశాలలో నాడు-నేడు పనులకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో   వి.ఎం.ఆర్‌.డి.ఎ. ఛైర్‌పర్సన్‌ ఎ.విజయనిర్మల, ఎంపీపీ కె.రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.గిరిబాబు, సర్పంచి పల్లె ఝాన్సీ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బీ ఈ వేడుకలు మొక్కుబడిగా నిర్వహించారని, ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి ఏర్పాట్లు లేవని స్థానికులు విమర్శించారు. అల్లూరి విగ్రహానికి కనీసం రంగులు కూడా వేయకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, చిత్రంలో

ఎమ్మెల్యే ముత్తంశెట్టి, వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని