logo

నాణ్యత, విశ్వసనీయతకు డీఆర్డీఓ కృషి

నాణ్యత, విశ్వసనీయతను పెంపొందించేందుకు డీఆర్డీఓ కృషి చేస్తోందని నేవల్‌ సిస్టమ్స్‌, మెటీరియల్స్‌ జనరల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వి.కామత్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ ఉత్సవంలో భాగంగా డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ మహాపాత్ర మానసి ఆడిటోరియంలో

Published : 05 Jul 2022 04:28 IST

శాస్త్రవేత్త పీవీఎస్‌ గణేష్‌కుమార్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను అందజేస్తున్న

నేవల్‌ సిస్టమ్స్‌, మెటీరియల్స్‌ జనరల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వి.కామత్‌

ఎన్‌ఏడీ కూడలి, న్యూస్‌టుడే: నాణ్యత, విశ్వసనీయతను పెంపొందించేందుకు డీఆర్డీఓ కృషి చేస్తోందని నేవల్‌ సిస్టమ్స్‌, మెటీరియల్స్‌ జనరల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వి.కామత్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ ఉత్సవంలో భాగంగా డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ మహాపాత్ర మానసి ఆడిటోరియంలో ‘క్వాలిటీ, రిలయబిలిటీ ఇంజినీరింగ్‌’లో సీప్‌ (కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ పోగ్రామ్‌) కోర్సును సోమవారం పారంభించారు.  ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మెరుగైన డిజైన్‌, అభివృద్ధికి సంస్థ కృషి చేస్తోందని, దీనికి శాస్త్రవేత్తలు, ఉద్యోగుల సహకారం ఎంతో ఉందని కొనియాడారు. అనంతరం ఎన్‌ఎస్‌టీఎల్‌కు బ్యూరో వెరిటాస్‌ అందించిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను శాస్త్రవేత్త పీవీఎస్‌ గణేష్‌కుమార్‌కు అందజేశారు. దిల్లీ డీఆర్డీఓ డైరెక్టర్‌ రియర్‌ ఆడ్మిరల్‌ రంజిత్‌సింగ్‌, శాస్త్రవేత్త సీవీఎస్‌ సాయిప్రసాద్‌, కోర్సు డైరెక్టర్లు డి.చంద్రశేఖర్‌, వేణుగోపాలరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని