Ayyannapatrudu: ఏపీలో జరుగుతున్న దోపిడీని ప్రధాని ఎందుకు ప్రశ్నించరు?: అయ్యన్నపాత్రుడు

తన ఇంటి ప్రహరీని కక్షపూరితంగా కూల్చడంపై మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వీడియో సందేశం ద్వారా స్పందించారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించి,

Published : 06 Jul 2022 01:44 IST

అనకాపల్లి: తన ఇంటి ప్రహరీని కక్షపూరితంగా కూల్చడంపై మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వీడియో సందేశం ద్వారా స్పందించారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించి, సంఘీభావం తెలిపి అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ ప్రశ్నించడం నా హక్కు. జగన్‌ వాటిని సరిదిద్దుకోవాలి తప్ప ప్రశ్నించిన వారందరిపై ఎన్ని కేసులు పెడతారు? ఐపీఎస్‌లు నిబంధనలు తెలియకుండా ఏ2 చెప్పాడని నా ఇంటి గోడను కూల్చివేస్తారా? ఆర్టీసీ ఛార్జీల పెంపు ద్వారా సామాన్యుడి నడ్డి విరిచారు. ప్రతి రోజూ 65లక్షల మంది ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణిస్తున్నారు. వారిపై ఎంత భారం పడుతుందో జగన్‌రెడ్డి ఎప్పుడైనా ఆలోచించారా? 3ఏళ్ల పాటు నీ చర్యలపై మాట్లాడడానికి భయపడిన జనం ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మాట్లాడటం ఆరంభించారు. తప్పులను సరిదిద్దుకో. అమ్మ ఒడితో మోసం చేశావు. ఆరోగ్యశ్రీలో మోసమే. నాడు-నేడు అవీనితి మయం. ప్రజలను అన్ని విధాలా తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

‘‘అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వారం పాటు కార్యక్రమాలు చేయమంటే ఎక్కడ చేశారు.  ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం అంటూ మోసం చేశావు. వారికి మెడికల్‌ సేవల కోసం ప్రతి నెలా వసూలు చేస్తున్న మొత్తం నుంచి ఒక రూపాయి కూడా విడుదల చేయడంలేదు. ఉద్యోగుల పీఎఫ్‌ మళ్లింపు మాటేమిటి. పోయే కాలం వచ్చినప్పుడు ఎవరు ఏమి చెప్పినా వినరు. ప్రధాని సభకు స్థానిక ఎంపీ రాకుండా అడ్డుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. భీమవరానికి స్థానిక ఎంపీ రాకుండా చేసిన పరిస్థితిని ప్రధాని అడ్డుకుని ఉంటే బాగుండేది. పక్క రాష్ట్రంలో భారీ దోపిడీ జరుగుతుంటే ప్రధాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దోపిడీని ఎందుకు ప్రశ్నించరు? ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ జరుగుతుంటే ప్రధాని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భాజపా నాయకులు ప్రధానికి ఏపీ పరిస్థితులను తెలియజేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అయ్యన్న తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని