logo

Andhra News: రౌడీయిజాన్ని చూపించబోయి..కటకటాల పాలయ్యారు

ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. అదికాస్త పెద్దదై.. రౌడీయిజాన్ని ప్రదర్శించబోయారు. తోటి స్నేహితులతో చేతులు కలిపి బృందాలుగా ఏర్పడి పరస్పరం దాడులకు తెగబడ్డారు. బీరు సీసాలు, బటన్‌ చాకుతో కొట్లాటకు దిగి పోలీసులకు చిక్కాడు.

Updated : 31 Jul 2022 09:47 IST

బొబ్బిలి, న్యూస్‌టుడే: ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. అదికాస్త పెద్దదై.. రౌడీయిజాన్ని ప్రదర్శించబోయారు. తోటి స్నేహితులతో చేతులు కలిపి బృందాలుగా ఏర్పడి పరస్పరం దాడులకు తెగబడ్డారు. బీరు సీసాలు, బటన్‌ చాకుతో కొట్లాటకు దిగి పోలీసులకు చిక్కాడు. సీఐ ఎం.నాగేశ్వరరావు వివరాల మేరకు.. మూడ్రోజుల క్రితం అమ్మాయి విషయంలో బొబ్బిలికి చెందిన ఇద్దరు యువకుల మధ్య ఆర్టీసీ కాంప్లెక్సులో ఘర్షణ జరిగి.. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. వీరిలో ఓ యువకుడు బొబ్బిలి యాదవవీధికి చెందిన కొంతమంది స్నేహితులకు విషయం చెప్పి సహకరించాలని కోరాడు. ప్రత్యర్థి కూడా విశాఖకు చెందిన కొందరిని సంప్రదించి, పథకం వేశాడు. రెండు టాటా ఏసీ వాహనాల్లో సుమారు 16 మందిని విశాఖ నుంచి శుక్రవారం రాత్రి రప్పించాడు. ఆర్టీసీ కాంప్లెక్సు వద్దున్న మద్యం దుకాణంలో పూటుగా తాగించి.. రాజా కళాశాల ముందు ప్రత్యర్థి వర్గం ఉందని తెలుసుకున్నాడు. బీరు సీసాలతో దాడికి తెగబడడంతో ఆర్టీసీ కాంప్లెక్సు వైపు కొందరు, రైల్వే వంతెనపై కొందరు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో చేరుకున్న పోలీసులు.. వెంబడించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి వచ్చిన వారిలో నలుగురుపై దారి దోపిడీతోపాటు పలు కేసులున్నాయి. ఇరువర్గాల నుంచి మొత్తం 14 మంది యువకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిలో కొంతమంది మెనiర్లు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా కొందర్ని అరెస్టు చేయాల్సి ఉందని సీఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని