logo

బతికే ఉన్నా.. పింఛను ఇప్పించరూ..!

బతికి ఉండగానే చనిపోయినట్లు చూపించి ఓ కల్లుగీత కార్మికుడి పింఛను తొలగించిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అచ్యుతాపురం మండలం చోడపల్లికి చెందిన కల్లుగీత కార్మికుడు గెద్దాడ నర్సింగరావుకు అయిదేళ్ల క్రితం ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి వరకు పింఛను తీసుకున్న

Published : 07 Aug 2022 03:43 IST

గతంలో పింఛన్‌ మంజూరైన పుస్తకాన్ని చూపిస్తున్న నర్సింగరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: బతికి ఉండగానే చనిపోయినట్లు చూపించి ఓ కల్లుగీత కార్మికుడి పింఛను తొలగించిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అచ్యుతాపురం మండలం చోడపల్లికి చెందిన కల్లుగీత కార్మికుడు గెద్దాడ నర్సింగరావుకు అయిదేళ్ల క్రితం ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి వరకు పింఛను తీసుకున్న నర్సింగరావుకు ఏప్రిల్‌ నుంచి అందకుండా పోయింది. ఆధార్‌, రేషన్‌ కార్డు, పింఛన్‌ మంజూరు పుస్తకం పట్టుకుని సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయానికి నాలుగు నెలలు పాటు పింఛను కోసం కాళ్లరిగేలా తిరిగాడు. మండలస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో స్పందన కార్యక్రమంలోనైనా తన సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లాడు. సచివాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్తే రద్దుచేసిన పింఛను పునరుద్ధరించకపోగా నువ్వు చనిపోయాయని సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యాడు. ‘నేను బతికే ఉన్నాను మహోప్రభో  నా పింఛను డబ్బులు నాకు ఇప్పించి కుటుంబాన్ని ఆదుకోండి’ అంటూ ఆ పేద గీతకార్మికుడు సిబ్బందిని దీనంగా వేడుకుంటున్నాడు. దీనిపై ఎంపీడీఓ విజయలక్ష్మి వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. పింఛను తొలగింపుపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని