logo

ఆస్తిపన్నుపై హైకోర్టులో వ్యాజ్యాలు

మూలధన విలువ ఆధారిత ఆస్తిపన్ను విధించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్‌ సవరణ చట్టం(44/2020), తదనుగుణంగా జారీచేసిన జీవో 198ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

Published : 09 Aug 2022 05:46 IST

జీవీఎంసీ కమిషనర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసుల జారీ

ఈనాడు, అమరావతి: మూలధన విలువ ఆధారిత ఆస్తిపన్ను విధించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్‌ సవరణ చట్టం(44/2020), తదనుగుణంగా జారీచేసిన జీవో 198ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విశాఖపట్నం అపార్ట్‌మెంట్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బి.భవానీగణేష్‌, గ్రేటర్‌ విశాఖ రెసిడెంట్‌ కాలనీ అసోసియేషన్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.నారాయణమూర్తి ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు. జీవీఎంసీ కమిషనర్‌.. ఆస్తిపన్ను చెల్లింపుదారుల నుంచి రూ.కోట్లలో లైబ్రరీ పన్ను వసూలు చేసి విశాఖ గ్రంథాలయ సంస్థకు కొంతమాత్రమే జమచేశారన్నారు. మిగిలిన సొమ్మును తిరిగి ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఇవ్వాలని కోరారు. ప్రతి ఇంటి నుంచి చెత్తపై యూజర్‌ ఛార్జీలను అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జీవీఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలతో ప్రస్తుత పిటిషన్లను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని