logo

పరిశ్రమల పార్క్‌ పనులకు 29న శంకుస్థాపన

అనకాపల్లి మండలంలోని కోడూరులో పరిశ్రమల పార్క్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలుకుతున్నట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అనకాపల్లి రోటరీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల

Published : 09 Aug 2022 05:46 IST

మంత్రి అమర్‌నాథ్‌


బుచ్చెయ్యపేటలో మంత్రిని పలకరిస్తున్న అవ్వ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి మండలంలోని కోడూరులో పరిశ్రమల పార్క్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలుకుతున్నట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అనకాపల్లి రోటరీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల మృతిచెందిన పాత్రికేయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 29న కోడూరులో పరిశ్రమల పార్క్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు వివరించారు. కొత్తగా అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ప్రెస్‌క్లబ్‌ భవన నిర్మాణానికి తనవంతు సాయంగా రూ. 10 లక్షలు అందిస్తామన్నారు. అనంతరం మంత్రి అమర్‌ను పాత్రికేయులు సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ వైకాపా అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, మళ్ల బుల్లిబాబు పాల్గొన్నారు.

* అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అమర్‌ తెలిపారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం 18 మందికి రూ. 11.34 లక్షల సీఎం సహాయ నిధి చెక్‌లను ఆయన అందజేశారు.

బుచ్చెయ్యపేటలో అభివృద్ధి పనుల ప్రారంభం

కశింకోట, న్యూస్‌టుడే:: పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కశింకోట మండలం బుచ్చెయ్యపేటలో సోమవారం మంత్రి పర్యటించారు. జోరువానలోనూ మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరాతీశారు. వృద్ధులను పలకరించి పింఛన్లు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఒక ఇంట్లో వారు బయటకు రాకపోవడం చూసి వారికి పథకాలు అందలేదా అని వాలంటీరును ప్రశ్నించారు. అందుతున్నాయని తెలపడంతో ముందుకు సాగారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు ఇస్తున్న పోషకాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన కాలువలను, రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఎంపీపీ కలగా లక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు దంతులూరి శ్రీధర్‌రాజు, సర్పంచి కోన నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, వైకాపా మండల అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కలగా గున్నయ్యనాయుడు, కొత్తపల్లి సర్పంచి కరణం శ్యాంసన్‌, మార్కెట్‌్ కమిటీ డైరెక్టర్‌ కరక సోమునాయుడు, ఎంపీడీఓ కొంకి అప్పారావు, ఎంఈఓ డి.దివాకర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని