logo

బయో డీజిల్‌ పరిశ్రమలో తనిఖీలు

కుమారపురంలోని ఆర్క్‌ ఇండియా పెట్రోలియం పరిశ్రమలో వాణిజ్య విభాగం అదనపు కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు కొనసాగాయి. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే డీజిల్‌ తయారు చేస్తామని ఏర్పాటు చేసిన

Published : 09 Aug 2022 05:46 IST

కుమారపురంలోని పరిశ్రమ

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కుమారపురంలోని ఆర్క్‌ ఇండియా పెట్రోలియం పరిశ్రమలో వాణిజ్య విభాగం అదనపు కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు కొనసాగాయి. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే డీజిల్‌ తయారు చేస్తామని ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో వాడేసిన వంట నూనె, ఇతర ఆయిల్స్‌ కలిపి నకిలీ పెట్రోలు ఉత్పత్తులు తయారు చేస్తునట్లు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో రెండు రోజుల కిందట తనిఖీలు చేపట్టారు. జీఎస్టీని 18 శాతానికి బదులు 8 శాతం చెల్లిస్తున్నట్లు తనిఖీల్లో తెలింది. ఇక్కడ తయారైన పెట్రో ఉత్పత్తులను సీల్‌ వేసిన అధికారులు, మరోసారి నమూనాలు సేకరించారు. తహసీల్దార్‌ జయప్రకాష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని