logo

పింఛన్లు, కార్డులు తొలగించేశారు సారూ..

స్పందన అర్జీల పరిష్కారంలో అలక్ష్యం వహిస్తే సహించబోమని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 180 మంది అర్జీలు అందజేశారు. అధికారులను

Published : 09 Aug 2022 05:46 IST

‘స్పందన’లో బాధితుల ఫిర్యాదు


అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: స్పందన అర్జీల పరిష్కారంలో అలక్ష్యం వహిస్తే సహించబోమని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 180 మంది అర్జీలు అందజేశారు. అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సచివాలయానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసినందున ప్రజాప్రతినిధులు పేర్కొన్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జేసీ విశ్వనాథన్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, రేషను కార్డుల తొలగింపుపై అధికంగా అర్జీలు అందాయి. కారు ఉందని, ఆదాయ పన్ను చెల్లించామని, రకరకాల సాకులతో తమ పింఛన్లను నిలిపివేశారని, రేషను కార్డుల్లో పేర్లు తొలగించారని పలువురు వినతులు అందజేశారు.

* ఆరిలోవకు చెందిన దివ్యాంగులైన పి.భవాని, పి.దివ్య వరసకు అక్కాచెల్లెళ్లు. ‘గత మూడేళ్లగా మేము పింఛన్లు పొందుతున్నాం. కారు ఉందని చెప్పి పింఛను ఆపేశారు. మాకు అటువంటిది ఏమీ లేదు. పింఛను పునరుద్ధరించాల’ని భవాని, దివ్య కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని