logo

ప్రియురాలు దక్కలేదని యువకుడి ఆత్మహత్య

ప్రియురాలు దక్కలేదని  ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మోసయ్యపేటకు చెందిన మరిపిరెడ్డి కుమారి భర్త చనిపోవడంతో కుమారుడు  జాను(20)తో

Published : 09 Aug 2022 05:48 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రియురాలు దక్కలేదని  ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మోసయ్యపేటకు చెందిన మరిపిరెడ్డి కుమారి భర్త చనిపోవడంతో కుమారుడు  జాను(20)తో కలిసి మోసయ్యపేటలో ఉంటోంది. రోజు మాదిరిగానే తల్లి కుమారి సోమవారం భోజనం చేసి పని నిమిత్తం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికొచ్చిన ఆమెకు తలుపువేసి ఉండటంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా.. ఫ్యానుకు వేలాడుతూ కుమారుడు కనిపించాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్ర తెలిపారు. మృతుడు జాను సెల్‌ఫోను ఛాటింగ్‌ పరిశీలించామని, ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. అనారోగ్యంతో భర్త, ఆదుకుంటాడనుకున్న కుమారుడి మృతితో తల్లి ఒంటరిగా మిగిలిందని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.  

కుటుంబ సమస్యలతో లారీ డ్రైవరు..

సబ్బవరం: కుటుంబ సమస్యల కారణంగా లారీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన సబ్బవరం మండలం రాయపుర అగ్రహారంలో చోటుచేసుకుంది.  రాయపుర అగ్రహారానికి చెందిన మత్స దేముడుబాబు(24) పోర్టులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  కొత్తవలస మండలం జమ్మాదేవిపేటకు చెందిన యశోదతో ఏడాది క్రితం వివాహమైంది. అప్పటి నుంచి దేముడుబాబు అత్తవారి ఇంట్లోనే ఉంటున్నాడు. తండ్రిని, నాన్నమ్మను చూసేందుకు ఈ నెల 7న రాయపుర అగ్రహారం వచ్చాడు. రాత్రి గదిలో పడుకున్న దేముడుబాబు తెల్లారినా లేవకపోవడంతో తండ్రి కిటికీ తెరచి చూసేసరికి ఉరివేసుకొని కనిపించాడు. కుటుంబ సమస్యలు కారణంగా మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. తండ్రి నాగరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని