logo
Published : 10 Aug 2022 05:35 IST

ప్రొటోకాల్‌పై.. నిలదీయనున్న

ప్రతిపక్షాలు నేడు కౌన్సిల్‌ సమావేశానికి ఏర్పాట్లు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ  సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 12 అంశాలపై చర్చ జరపనున్నారు. జీవీఎంసీలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రతిపక్ష కార్పొరేటర్లను ఆహ్వానించకపోవడం, చివరి క్షణంలో సమాచారం ఇవ్వడం వంటి ప్రొటోకాల్‌ అంశాలపై సభ్యులు నిలదీసే అవకాశం ఉంది. ఆస్తి పన్ను ఆధారంగా చెత్త సేకరణ ఛార్జీల ప్రతిపాదన కీలక అంశంగా మారనుంది. ఛార్జీలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండటంతో దీనిపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. భీమిలి మండలం కొత్తవలసలో రెవెన్యూకు చెందిన భూమి 50 ఎకరాలను వీఎంఆర్‌డీఏకు కేటాయించడానికి మేయరు ముందస్తు అనుమతి ఇవ్వడంపై కూడా సభ్యులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని